Friday, 31 July 2026 03:39:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం...

Date : 17 July 2023 12:21 PM Views : 350

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం : మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఏఎంసీ కాలనీ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల తీరు అధ్వానంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వ బడులలో సరైన వసతులు లేక విద్యార్థినీ విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న పుస్తకాలు, నోట్ బుక్స్ పిల్లలకి కల్పించాల్సిన టువంటి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఆగడాలు మితిమీరి పోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా అడ్డగోలు దోపిడీ తో ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఫీజులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ బడులలో సరైన వసతులు కల్పిస్తే ప్రైవేట్ పాఠశాలలకు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారని మౌలిక వసతులు కల్పించకపోవడం వలన ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన అన్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలలో సరైన మరుగుదొడ్లు లేక విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రతి పాఠశాలలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాల సీజన్ ప్రారంభమైనందున విద్యార్థులకు శుభ్రమైన కలుషితం లేని మంచినీరు పాఠశాలలలో అందించాలని, ప్రతి పాఠశాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ఆయన కోరారు. గత కొద్ది సంవత్సరాల నుండి విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ లు చెల్లించకపోవడం దుర్మార్గమైన చర్య అని, పెండింగ్ స్కాలర్షిప్ లు చెల్లించకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గా సాయి, భార్గవ్ సాయి రాజేష్, చిన్న, వినయ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: