సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి యెర్రా కామేష్ తెలిపారు.ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చి తప్పు చేసినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు.అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తే నియోజకవర్గంలో అవినీతి తీవ్ర స్థాయిలో పెరిగిందని ఆరోపించారు.అధికార పార్టీ నాయకులు అందినకాడికి దోచుకోవడం చేస్తున్నారని అన్నారు.నియోజకవర్గంలో ఎవరు గెలిచినా అభివృద్ధి మాత్రం జరగడం లేదన్నారు.మూస ధోరణిలో ఓట్లు వేయడం వల్లే కొత్తగూడెం అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో బీఎస్పీ చేసి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.వార్డుల్లో సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్న పట్టించుకునే నాధుడే కరివేయాడని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కేంద్రంలో సమస్యలు ఈ స్థాయిలో ఉంటే మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలని అన్నారు.పట్టణ ప్రజలు విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని,పాలక పక్షం వార్డుల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయాల్సి ఉన్న కనీసం ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదని ఆరోపించారు.తక్షణమే దోమల నివారణ కోసం మున్సిపల్ పాలక పక్షం జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం లేకపోలేదని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,చెనిగరపూ నిరంజన్ కుమార్,కోటి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin