సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఎస్సి కుటుంబానికి చెందిన చేడపంగు వీరానర్సింహా గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యం తో విబ్బంది పడటం జరిగింది వారి కుటుంబనికి రఘు చేయూత ద్వార 5000/-రూపాయలు మరియు 50 కేజీల బియ్యం ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న చేతుల మీదుగా వారికి అందజేశారు . నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు గోపి నాయుడు ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబాన్ని గతంలో పరామర్శించడం జరిగింది వారి ఆరోగ్య బాధ్యత నాదే అని తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు . కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు అన్న చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నము ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వందల కుటుంబాలకు దశ దిన & వివాహా మహోత్సవ కార్యక్రమాలకు ఆర్ధిక సాయం చేయడం జరిగింది మన హుజుర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎన్నో నిరుపేద కుటుంబలకు రఘు సాయం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమనికి సాయం చేయడం, అదేవిధంగా వినాయక విగ్రలు, అమ్మవారి విగ్రహాలూ వివ్వడం గాని, ఎన్నో నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వార ఆర్ధిక సాయం చేయడం గానీ బతుకమ్మ పండుగ సందర్భంగా బహుమతులు వివ్వడం క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా సమగ్రీని వివ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే హుజూర్ నగర్ నియోజకర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు, రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న, కుమ్మరికుంట్ల గోపి, యాసరపు సుధాకర్, పిల్లుట్ల సాయిబాబా, వీరానర్సింహా,రవి నాయక్ ,రాజు నాయక్,బొమ్మకంటి సైదులు ముదిరాజ్,చారీ, జిలాని,వినయ్, సాయి, సైదులు గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin