Thursday, 30 July 2026 03:23:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టి జి ఎం ఎస్ లో ఘనంగా తెలంగాణ బాషా దినోత్సవ వేడుకలు...

Date : 10 September 2025 01:54 AM Views : 397

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట అమీనాబాద్ మోడల్ స్కూల్ ఆర్ కాలేజీలో కాళోజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ భాష దినోత్సవాన్ని మంగళవారం నాడు అమీనాబాద్ లోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి ప్రిన్సిపల్ శ్రీమతి చిట్టా జ్యోతి పూలమాలవేసి నివాళులు అర్పించారు అదేవిధంగా ఉపాధ్యాయులంతా పూలు సమర్పించి ఘనంగా నివాళులు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి తెలుగు అధ్యాపకులు సూరిబాబు గారు కాళోజి ఆయన తెలంగాణ భాషకు మరియు తెలంగాణ ప్రాంతానికి చేసిన సేవ గురించి చాలా విషయాలు వివరాలు విద్యార్థులకు తెలియజేశారు అదేవిధంగా తెలుగు ఆచార్యులు నల్లతీగల యాకయ్య గారు కూడా కాలోజీకి సంబంధించిన ఇంకొన్ని విషయాలను ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన, పాటల పోటీలు,కాళోజీ నినాదులు సూక్తుల పై పోటీలు నిర్వహించడం జరిగింది దీనిలో విజేతలుగా వ్యాసరచనలో ప్రథమ స్థానం కురిమిండ్ల అమృత ఎంపీసీ సెకండ్ ఇయర్ , ద్వితీయ స్థానం ఎస్ శ్రీనిత్య పదవ తరగతి ఆర్యభట్ట, చిత్రలేఖన పోటీలలో ప్రథమ స్థానం సిలువేరు కీర్తి రేఖ ఎంపీసీ సెకండ్ ఇయర్, ద్వితీయ బహుమతి కుంట శ్రీజ పదవ తరగతి , నినాదాలు సూక్తుల పోటీలో ప్రధమ బహుమతి మిల్కూరి దివ్యశ్రీ పదవ తరగతి, పాటల పోటీలో మొదటి స్థానం కుంట శ్రీజ పదవ తరగతి, వ్యాసరచనలో ప్రోత్సాహక బహుమతులను అఖిల శ్రీవర్ష గెలుచుకున్నారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం రాజు,మూడు మౌలాల్ సదాకర్,అర్జున్, మహేందర్, రవి రాజేంద్ర ప్రసాద్,అమీన్షరిఫ్,రాము, మీన కుమారి ,పావని మేడమ్,జగదీష్,యాకూబ్, సురేశ్,రమేష్, అశోక్ పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :