సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణం మహేశ్వరం గ్రామంలో గల సెయింట్ మేరీ పాఠశాలలో అన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన నర్సంపేట మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుందని విద్యతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడలలో రాణించాలని స్వామి వివేకానంద చెప్పినట్టు జ్ఞానం అనేది తరగతి గదిలోనే మాత్రమే కాదు క్రీడా ప్రాంగణంలో కూడా ఉంటుందని ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ స్పందన మాట్లాడుతూ ఈరోజు అన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవంలో భాగంగా జ్యోతిని వెలిగించడం జరిగింది. ఈ అన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని ప్రతి విద్యార్థి శారీరక దారుఢ్యం పై అవగాహన పొందుతూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ రష్మిత, పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ సిస్టర్ మరియు గోరెట్టి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter