సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి / బుక్కపట్నం / కొత్త చెరువు :- తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి , యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు మైలు రాయి చేరుకున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి మరియు ఇంఛార్జి డా పల్లె రఘునాథ్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తొలుత పుట్టపర్తిలో హనుమాన్ సర్కిల్ నందు సత్యమ్మ దేవాలయం వద్ద పూజలు అనంతరం ప్రారంభమైన యాత్ర కర్ణాటక నాగే పల్లెకు చేరుకోగానే ఆ ప్రాంత ప్రజలు ఆయనకు బాణా సంచ పేల్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి జానాకం పల్లికి చేరుకోగానే ఆ గ్రామ ప్రజలందరూ పొలిమేరలో ఎదురై స్వాగతం పలికారు. ఆ గ్రామస్తులుతో మమేకమై వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. పాదయాత్ర కొనసాగుతున్న అంత సేపు గ్రామ రోడ్లు అన్ని కిక్కిరిసిపోయాయి.అనంతరం బుక్కపట్నం మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన టిడిపి నాయకులు , ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధి వెంట సాగిన పాదయాత్రకు ప్రజలు మద్దతు పలికారు. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంజూరు అయి నిర్మాణ దశలో ఉన్న డిగ్రీ కళాశాల వద్ద అయన సెల్ఫీ తీసుకున్నారు. నాలుగేళ్లు గడిచినా ఎక్కడి నిర్మాణం అక్కడే ఆగిపోయింది అని అన్నారు.అనంతరం బుక్కపట్నం చెరువు నారా చంద్రబాబు గారు ఆవిష్కరించిన పైలాన్ వద్ద సెల్ఫీ తీసుకొని, వైకాపా వారు ధ్వంసం చేసిన పైలాన్ ను పరిశీలించారు.అటు నుంచి కొత్త చెరువు చేరుకోగానే, మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టి స్వాగతం పలికారు.అనంతరం ఎన్టీఆర్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యకర్తలు, ప్రజలును ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ- నారా లోకేష్ చేపట్టిన సాదాసీదా పాదయాత్ర కాదు. 100 రోజులుగా సాగిన పాదయాత్రతో వైసీపి ఎమ్మెల్యేలకు మంత్రులకు నిద్ర పట్టడం లేదు. ఆ యాత్ర ప్రభంజనం 2024 లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలందరి రుణం తీర్చుకుంటాం.ఇటివల ఈ ప్రభుత్వం జగనన్నకు చెబుదాం అని ఒక కార్యక్రమం మొదలు పెట్టారు, ఏమి చెప్తారో నాకు అర్దం కాలేదు, చెప్పడానికి తనకే సిగ్గుగా ఉందని, ఒక్క సమస్య అయితే చెప్పోచ్చని, ఆ జగన్ అనే వ్యక్తే సమస్య అయితే ఇంకేమి చెప్తాం అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకముందు 3000 పించన్ ఇస్తామన్నారు, ఇంత వరకు ఇవ్వలేదు. ఆ విషయం జగనన్న కు చెప్పండి.8 లక్షల పింఛన్లు పీకేశాడు అని చెప్పండి. చేనేత కార్మికులకు 50 సం "లకు పింఛన్ల ఇచ్చాం. కానీ వాటిని రద్దు చేశారు అని చెప్పండి. ఎవరైనా పెళ్ళిలు చేసుకుంటే పెళ్లి కానుక ఇచ్చాం. కానీ అది అటకెక్కింది. నాలుగేళ్లు అయినా ఏ ఒక్కరికీ అయినా ఇచ్చారా ? ఎవరికైనా ఆక్సిడెంట్ అయి మరణిస్తే చంద్రన్న భీమా అందించి ఆ కుటుంబాలను ఆదుకొనే వాళ్ళం. దానికి పంగ నామాలు పెట్టాడు.5 రూపాయలకే అన్న క్యాంటీన్ తో భోజనం పెడితే , వాటిని రద్దు చేసి పేదల కడుపు కొట్టాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్లు ఇవ్వకుండా వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. చివరకు ఇసుక కూడా దొరకనివ్వలేదు, వేలాది రూపాయలు పెంచేసి ప్రభుత్వమే దోచుకుంటున్నారు. వైసీపి నాయకులు కోట్లకు పడగలెత్తారు.చంద్రబాబు పాలన కు జగన్ పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. డిజల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.చివరకు ఈ తుగ్లక్ రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు, కానీ టిడిపి అధికారంలోకి వచ్చాక తప్పకుండా దేశంలోని మిగతా రాజధానులు తలదన్నేలా రాజధానిని నిర్మిస్తాం. రైతుల ఆత్మహత్యలుతో ఆత్మహత్యల ప్రదేశ్ గా మార్చారు. డ్రిప్, ఇన్సూరెన్స్, వ్యవసాయ పరికరాలు రద్దు చేశారు.ఎస్సీ, ఎస్టీ , బీసీలకు తెదేపా హయంలోనే రాజ్యాధికారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ కోటరినే , సామాజిక న్యాయం కావాలంటే టీడిపి అధికారంలోకి రావాలి.పుట్టపర్తిలో బిసిలకు పెద్ద పీట వేసింది నా హయంలోనే, జనరల్ కు రిజర్వ్ అయినా అనేక ముఖ్యమైన పదవులు బిసిలకు కేటాయించాను, నేనే అసలు సిసలు బిసిని, నేనే అసలు సిసలు ఎస్టీని, నేనే అసలు సిసలు ఎస్సీని. నియోజకవర్గ వ్యాప్తంగా మైనారిటీలకు షాదిఖానాలు నిర్మించాను.గ్రూపులు పక్కన పెట్టి ఈ సారి అందరం కష్టపడదాం, మనం లాస్ట్ ఓవర్ కు వచ్చాం. అందరం సిక్సులు కొడితేనే విజయం. 30 ఏళ్లుగా రాజకీయ జీవితంలో తన నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నా. నేను రౌడీయిజం చేయను, భూములు లాక్కోను, నాకు చాలా గౌరవం ఇచ్చారు. మీ రుణం ఊరికే పోదు, ఈ సారి గెలిచి మీ అందరి పెద్ద కొడుకుగా, అన్నగా అండగా నిలుస్తాను . నారా చంద్రబాబు దగ్గర నుంచి నా వరకు అందరి మీద కేసులు పెట్టారు, కేసులతో ఏమి పీకలేరు.ఈ నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా 50 రోడ్లు ఇస్తే వాటికి పేర్లు వేసుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే. సిగ్గు లజ్జ లేకుండా గొప్పలు చెపుతున్నారు.మీ కష్ట నష్టాల్లో భాగం అవుతాను. ఎమ్మల్యే గా చేశా, ఎమ్మెల్సీ, మంత్రిగా ఒక్క పైసా అవినీతి చేయలేదు.- ఎవరైతే పార్టీకి కష్ట పడతారో వారికి పట్టం కడతాను,ఈ సారి ప్రతి ఊరికి నేనే వస్తాను, మీ కష్టాలు తీరుస్తాను....
-----------------------
Admin