సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట : జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతoగి వీరస్వామి గౌడ్, సమర్ధుడైన నాయకుడికి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని *జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతoగి వీరస్వామి గౌడ్ అన్నారు.భారత రాజ్యాంగం దినోత్సవం ను పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పిoచి మాట్లాడారు. ఓటు అనేది వజ్రాయుధం అని సమర్థవంతమైన నాయకుడు ఎన్నుకంటే ప్రజల బతుకులు మారాతాయన్నారు. ప్రజలకు న్యాయం జరగాలoటే మనం వేసే ఓటే తలరాత ను మార్చగలదన్నారు. భారత రాజ్యాంగలో పొందుపర్చిన ఆర్టికల్ ప్రకారమే ప్రతి మనిషికి ఓటు హక్కును ప్రసాదించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి ,పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, అయితే గాని మల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin