సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ కోసం ఉదృతంగా పోరాటం జగురుతున్న తరుణంలో బీఎస్పీ జాతీయ పార్టీగా మద్దతు తెలిపిందని,పార్లమెంటులో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలిపిన మొట్టమొదటి పార్టీ బీఎస్పీ అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ గుర్తు చేశారు.మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భరోసా మహాసభతో మే ఏడో తేదీన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు,బెహన్ మాయావతి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారన్నారు.మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా యావత్ తెలంగాణలోని బీఎస్పీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని నింపినట్లు అయిందన్నారు.మాయావతి సూచనలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణలో బీఎస్పీ జెండాను ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు.ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా సన్నద్ధమవ్వాలని అన్నారు.రానున్న ఆరు నెలల కాలం ఎంతో విలువైందని చెప్పారు.ధన బలం,మద్యం ఆసరాగా చేసుకొని ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి చైతన్యవంతులైన బీఎస్పీ ఓటర్లు సరైన సమాధానం చెప్తారని అన్నారు.ఒక్క బీఎస్పీ మాత్రమే బీసీలకు 60 శాతం నుంచి 70 శాతం వరకు టికెట్లు ఇవ్వడంతో పాటు వారిని కూడా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు.ఇందుకుగాను ఇప్పటినుంచే ఒక ప్రణాళిక బద్ధంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు.ఏది ఏమైనప్పటికీ ఈసారి ముఖ్యమంత్రిగా ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు.అదేవిధంగా కేసీఆర్ ను కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామని జోష్యం చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,సాయి,మాలోత్ వీరు నాయక్,తాటిపాముల హరిక్రిష్ణ,రంజిత్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin