సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : గులాబీ పార్టీలో అసమ్మతి రోజు రోజుకు మరింత పెరుగుతుందంట. ఇంఛార్జ్ లను రంగంలోకి దింపినా పరిస్థితి లో మార్పు రాకపోగా.. ఇంచార్జ్‌ల రాకతో పరిస్థితి మరింత జఠిలంగా మారిదంట. దీంతో నేరుగా అదిష్టానమే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అసమ్మతి మరింత పెరిగిన నియోజక వర్గాల నేతలకు నేరుగా ఫోన్ చేస్తున్న సీఎం కేసీఆర్ తస్మాత్ జాగ్రత్త అంటూ గట్టిగానే హెచ్చరిస్తున్నట్టు సమాచారం. పెద్ద సార్ నుంచి ఫోన్ రావడంతో అభ్యర్థులు, ఇంఛార్జ్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూనే దిశ నిర్దేశం చేస్తున్నారంట కేసీఆర్. ఓ వైపుసుడిగాలి పర్యటనల్లో పాల్గొంటునే మరో వైపు సొంత పార్టీ అభ్యర్థులకు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారంట. తాజాగా నిర్మల్ జిల్లా లో ప్రజా ఆశీర్వాద సభల అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు అభ్యర్థులకు ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీయడంతో పాటు ఎక్కడ లోపం ఉంది ఏ గ్రామం ఏ మండలంలో పరిస్థితి ఎలా ఉందో తనే చెప్తుండటంతో షాక్ అవుతున్నారంట అభ్యర్థులు. ఇంచార్జ్ లుగా వచ్చిన నేతలకు సైతం గట్టిగానే క్లాస్ ఫీకుతున్నారంట పెద్దాయన....
-----------------------
Admin