సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ అవకాశంగా కనిపించే రిజర్వేషన్ల ప్రస్తావన 2025 నూతన సంవత్సరంలోనైనా అమలుకు నోచుకుంటాయా అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ సందేహం వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓటు బ్యాంకు గా మాత్రమే బీసీల రిజర్వేషన్ల హామీలు ఇస్తూ వచ్చారు ఇప్పటికీ ఎటువంటి అమలుకు నోచుకోకపోవడం బాధాకరం అన్నారు జనాభా ప్రాతిపదిక నా రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటికీ ప్రకటించడం లేదు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు రిజర్వేషన్ ప్రకటించాలంటూ ఊదరగొట్టడం ఓటు బ్యాంకు రాజకీయంగా కనిపిస్తుంది కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన పార్టీ ఎన్నికల తర్వాత దాటివేస్తుంది ఈ పరిణామాలు చూస్తూ ఉంటే బీసీ రిజర్వేషన్లు అమలుకు నోచుకుంటాయా లేవా అని సందేహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రిజర్వేషన్లు ప్రకటించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు స్వతంత్రులుగా పోటీ చేసి అన్ని రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొండ రామకృష్ణంరాజు రాష్ట్ర కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుణగంటి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin