సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ లో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చౌటపల్లి గ్రామానికి చెందిన కసర్ల రంగయ్య కి లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ, వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందిన, పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక సంజీవని లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మట్టపల్లి దేవస్థాన కమిటీ మెంబర్ కుమ్మరి కుంట్ల వెంకటనారాయణ , మాజీ మున్సిపాలిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ , కొండల్ రెడ్డి, కడియాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin