Saturday, 01 August 2026 06:19:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా బిజెపి ఎన్నికల ప్రచారం...

Date : 30 October 2023 02:25 AM Views : 376

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారని ఈసారి జరిగే ఎన్నికల్లో బిజెపిని ఆదరించి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయానికి మొదటగా కొందుర్గు మండలం లాలపేట నుండి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, దేపల్లి అశోక్ గౌడ్, భూపాల చారి, వంశీ కృష్ణ, ఇసునాతి శ్రీనివాస్, శేరి విష్ణువర్ధన్ రెడ్డి, మోటే శ్రీనివాస్, చెట్ల వెంకటేష్, ప్యాట అశోక్, మల్చలం మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలన లో, 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో పేదల బ్రతుకులు ఏమీ మారలేదని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం రైతులను, నిరుద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కేవలం మోడీ ప్రభుత్వం మాత్రమే కృషి చేస్తుందని అన్నారు. ఒక నిరుపేద కుటుంబం నుండి ప్రధాన మంత్రి అయ్యారు కాబట్టే పేదల కోసం పని చేస్తున్నారని అన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం మోడీ మరుగుదొడ్లు నిర్మించారని, ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసారని అన్నారు. ఈసారి తెలంగాణా బిజెపికి అవకాశం ఇవ్వండ, బిజెపి అధికారం లోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష్మీదేవి పల్లె రిజర్వాయర్ ను నిర్మించుకొని కృష్ణా జలాలను షాద్ నగర్ కి తెచ్చుకుందామని అన్నారు. ఈ సందర్బంగా అందె బాబయ్య మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి పెద్దపీఠ మోడీ ప్రభుత్వమని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరానికి దాదాపు లక్ష కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ ల ద్వారా ఇస్తున్నారని అన్నారు. కాబట్టి ఈసారి తెలంగాణా లో బిజెపి ని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంకనోళ్ల వెంకటేష్, లక్ష్మికాంత్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు కొమరబండ శ్రీశైలం, బోయ కురుమయ్య, రఘురామ్ గౌడ్, నర్సింలు, ఈసరి సత్యనారాయణ, బోయ శంకర్, సుధాకర్, నరేష్, సాయి గౌడ్, పసులోటి శ్రవణ్, శ్యామ్ సుందర్, హరి భూషణ్, వివేక్, అభిలాష్, ఈసరి లింగం మరియు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: