సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని నాగార్జున సిమెంట్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్న సత్యనారాయణ ఉషాలక్ష్మి దంపతులకు కుమార్తె మీనాక్షి శ్రీ కు అరుదైన గౌరవం దక్కింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో గల బుద్దాల కన్వెన్షన్ హాల్ లో ఈనెల 16,17 తేదీలలో శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ 21 ప్రపంచ రికార్డులు సాధించిన సంస్థ అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కన్వీనర్ కొల్లి రమావతి చేతుల మీదుగా మఠంపల్లి మండలం నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ సింహపురి కాలనీకి చెందిన శ్రీరామ్ రెడ్డి మీనాక్షి శ్రీ చేసిన నృత్య ప్రదర్శనను అభినందిస్తూ నాట్య మయూరి అవార్డు అందజేశారు మరియు తెలుగు సాహితీ కళా చరిత్రలో 30 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన రికార్డుగా గుర్తించి అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ టాలెంట్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు టిఎన్మ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ) కల్చలర్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో మీనాక్షి శ్రీ పేరు నమోదు చేస్తున్నట్లుగా ధ్రువీకరిస్తూ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని మీనాక్షి శ్రీ కు అందజేసి ఘనంగా సత్కరించారు.సోమ వారం ఆమె తల్లితండ్రులు సత్యనారాయణ ఉషా లక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.మీనాక్షి శ్రీ ని నాగార్జున సిమెంట్ పరిశ్రమ అధికారులు ఉద్యోగులు అభినందించారు.నన్ను ముందుండి ప్రోత్సహిస్తున్న డాక్టర్ గుంటి పిచ్చయ్య అభినందిస్తున్నారు.అలాగే శిక్షణ గురువురాలైన గుంటి సుష్మిత గారిని అభినందిస్తూ సుస్మిత శిక్షణలో ఈ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది.ముందు ముందు ఇలాంటి అవార్డులు ఎన్నెన్నో తీసుకురావాలని గుంటి పిచ్చయ్య, డాక్టర్ పగడాల శ్రీనివాస్ సుష్మతి చెప్పారు.
-----------------------
Admin