Friday, 31 July 2026 04:48:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్‌నగర్ "బాద్ షా" వీర్లపల్లి శంకర్...

Date : 04 December 2023 12:46 PM Views : 301

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. షాద్ నగర్ అసెంబ్లీ చరిత్రలో వీర్లపల్లి శంకర్ 16వ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠకు తెర తీస్తూ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. గతంలో 2014లో కాంగ్రెస్ కంచుకోటను కైవసం చేసుకున్న గులాబీ దండు తిరిగి అదే జోరును కొనసాగించలేక పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. కాషాయ దళ బిజేపి షాద్ నగర్ అసెంబ్లీలో చతికిలపడింది. 2023 శాసనసభ ఎన్నికల కోసం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, ఆల్ ఇండియా ఫర్ వర్డ్ బ్లాక్ బీఎస్పీ పార్టీలతో సహా మొత్తం 14 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తంభ కొనసాగింది టిఆర్ఎస్ పార్టీ విజయాలకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కు 77,817 ఓట్లను సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వై. అంజయ్య యాదవ్ కు 70,689 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి అందే బాబయ్యకు 8,164 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బిజెపి రెబల్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి 31,651 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పి అభ్యర్థి పసుపుల ప్రశాంత్ కు 2,623 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అదేవిధంగా సిపిఎం పార్టీ అంతర్గతంగా సహకరించింది. ఇకపోతే ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ పై 7,128 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులకు పలువురికి నల్లమాత్రపు ఓట్లు వచ్చాయి. 2014లో మొట్ట మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. ఆ తర్వాత 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా తన ప్రభావాన్ని చూపించింది. అంతకుమించి అన్నట్టు టిఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడవసారి అంజయ్య గెలుపు వాకిట బోర్లా పడ్డారు. అంజయ్య స్పీడుకు కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేసింది. షాద్ నగర్ నియోజకవర్గంలో 1952లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొట్ట మొదటిసారిగా బూర్గుల రామకృష్ణారావు ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా షాద్ నగర్ అవతరించింది. ఆ తర్వాత రెండుసార్లు 1985లో ఎం. ఇందిర, 1994లో బక్కని నరసింహులు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మారుతున్న కాలానుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. 2014లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజాబలంతో గెలుపొందారు. ఆ తర్వాత 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో కూడా మళ్లీ అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వరుసగా రెండుసార్లు విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2023లో జరిగిన ప్రస్తుత ఎన్నికల్లో కారు స్పీడ్ కు కాంగ్రెస్ కళ్లెం వేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గులాబీ శ్రేణుల కారు స్పీడుకు ఏ పార్టీ ముందర నిలబడలేదు. షాద్ నగర్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగింది. 2009 ఎన్నికల నుండి ఓసారి రాజకీయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 44% ఓట్లు నియోజకవర్గంలో పోలయ్యాయి. టిఆర్ఎస్ పార్టీకి 37% ఓట్లు పోలయ్యాయి. బిజెపి మిగతా పార్టీలకు 12 శాతం ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి నాగమూశాతం టిఆర్ఎస్ పార్టీకి 37% బిజేపి ఇతర పార్టీలకు 19 శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే టిఆర్ఎస్ పార్టీకి 45 శాతం కోట్లు పోలయ్యాయి కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు వచ్చాయి అదేవిధంగా బిజెపికి ఇతర పార్టీలకు కలిపి 20 శాతం ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా 2014 పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి 42 శాతం ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ పార్టీకి 33% కోట్లు పోలయ్యాయి అదే విధంగా బిజెపి తదితర పార్టీలకు 26% ఓట్లు పోలయ్యాయి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే టిఆర్ఎస్ పార్టీకి 43% ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 31 శాతం ఓట్లు పోలయ్యాయి. బిజెపి ఇతర పార్టీలకు కలిపి మొత్తం 25% ఓట్లు పోలయ్యాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే టిఆర్ఎస్ పార్టీకి 44% ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 26% ఓటు పోలయ్యాయి. బిజెపి ఇతర పార్టీలకు 29% ఓట్లు పోలయ్యాయి. 2009 నుండి 2018 వరకు జరిగిన మూడు పర్యాయాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 2009 ఎన్నికల్లో మినహా కాంగ్రెస్ పార్టీ మిగతా రెండు పర్యాయాలు చతికిలబడింది. బిజెపి పార్టీ అయితే అడ్రస్ లేకుండా పోయింది. ఒక పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గత ఎన్నికల్లో డీకే అరుణ వచ్చాక బిజెపిలో గణనీయమైన ఓటు బ్యాంకు పెరిగింది. అది ఎంత అంటే కాంగ్రెస్ తో పోల్చుకుంటే ఈ నియోజకవర్గంలో బిజెపి బలంగా ఉండేది. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో వీర్లపల్లి శంకర్ ఈ చరిత్రను తిరగరాశారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకోవచ్చారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి అంజయ్య ఎల్గనమోని కారు గుర్తుపై 70,315 (45.37%) ఓట్లు వచ్చాయి. చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చేతి గుర్తుపై 52987 (34.19%) ఓట్లు సాధించారు. శ్రీవర్దన్ రెడ్డి నెల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తుపై 20,425 (13.18%) ఓట్లు వచ్చాయి. ఇక ఏనుగు మహేందర్ రెడ్డి స్వతంత్ర ఆటో-రిక్షా 5108 (3.3%), బొబ్బిలి సుధాకర్ రెడ్డి వైయస్సార్ పార్టీ, సీలింగ్ ఫ్యాన్ 1713 (1.11%), అందరి అంజయ్య స్వతంత్ర అభ్యర్థి గ్యాస్ స్టవ్ 949 (0.61%) ఓట్లు వచ్చాయి. ఇక నోటా 846 (0.55) ఓట్లు పోలయ్యాయి. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీలకు పోలైన ఓట్ల వివరాలు అంజయ్య ఎలగనమోని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా కారు గుర్తుపై 72, 315 (43.43%) ఓట్లు పోలయ్యాయి. చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అభ్యర్ధిగా కాంగ్రెస్ చేతి గుర్తుపై 51890 (31.16%) ఓట్లు వచ్చాయి. వీర్లపల్లి శంకర్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ తరుపున ఏనుగు గుర్తుపై 27,814 (16.7%) కోట్లు తెచ్చుకున్నారు. నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై 5162 (3.1%), అంధరి అంజయ్య స్వతంత్ర అభ్యర్ధి ట్రక్ గుర్తుపై 3199 (1.92%), అమ్మీ సంతోష్ కుమార్ స్వతంత్ర అభ్యర్ధి రోడ్ రోలర్ గర్తుపై పై 2301 (1.38%) ఓట్లు వచ్చాయి. నోటా గుర్తుపై 1909 (1.15%) ఓట్లు పోలయ్యాయి. 2023 ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీని హస్తం ఓడించింది. ఇందుమూలంగా చెప్పేది ఎందంటే.. షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ బలమైన ఓటు బ్యాంకుతో ఉండగా కాంగ్రెస్ పార్టీ వారిని ఓడించి తన కైవసం చేసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాత్రం బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన పనులు చేయకపోవడం టిఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తదితర కారణాలను తన విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల ముందుకు తెచ్చి నువ్వా నేనా? అన్న తీరుతో నియోజకవర్గంలో ప్రచారం చేశారు.అలాగే షాద్ నగర్ అసెంబ్లీలో కూడా ఈసారి కాషాయ జెండా ఎగురుతుందని భావించారు. బండి సంజయ్ మార్పుతో పార్టీ డీలా పడింది. అంతేకాదు అభ్యర్థి ఎంపికలో కూడా తలనొప్పి వీడలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి ఉంటే కొంత ఆశాజనకంగా ఉండేది. అందుకే భారతీయ జనతా పార్టీకి నష్టం తప్పలేదు. ఆ పార్టీలో ఏపీ మిథున్ రెడ్డి, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా పోటీపడి ఆ తర్వాత ఎవరికి వారు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇక పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మంచి జోరుతో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు విష్ణువర్ధన్ రెడ్డిని ఈజీగా తీసుకుంటే ఈ రెండు పార్టీలు పప్పులో కాలేసినట్టేనని విశ్లేషకులు ఆనాడే హెచ్చరించారు. ఎన్నికల్లో 30 వేల ప్రజలకు ఓట్లను పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సాధించి టిఆర్ఎస్ పార్టీ విజయం ఆశలపై నీళ్లు చల్లారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :