సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మునగాల మండలం, తాడువాయి గ్రామానికి చెందిన జిల్లేపల్లి శోభన్ బాబు గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మీదుగా నియమక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రెండవ ర్యాంక్ సాధించిన శోభన్ బాబు మాట్లాడుతూ నేను ఈ స్థాయిలో ర్యాంకు రావడం పట్ల చాలా ఆనందంగాను, సంతోషంగాను ఉందని, ఈ స్థాయిలో రావడానికి నా తల్లిదండ్రులు జిల్లేపెల్లి వెంకటయ్య మైసమ్మ, నా అన్నదమ్ములు రవి సుమన్ ల సహకారం మరువలేనని, చిన్నతనం నుండి నా తల్లిదండ్రులు కాయకష్టం చేసి మమ్మల్ని పెంచి చదివించి పెద్ద చేశారు. నాకు ఉద్యోగ రావడం పట్ల నా తల్లిదండ్రులు, అన్నలు ఆనంద భాష్పాలు రాడు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని, ప్రణాళిక బద్ధంగా సమయాన్ని కేటాయించి చదివితే ఎంతటి స్థాయికైన చేరుకోవచ్చని అన్నారు. జిల్లేపల్లి శోభన్ బాబు జిల్లేపల్లి వెంకటయ్య మైసమ్మల 3వ,సంతానం. తన మొదటి అన్న రవి, రెండవ అన్న సుమన్ లు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యాభ్యాసం చేసి గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా ఉద్యోగం సాధించారు. తన విద్యాభ్యాసం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు తాడువాయి గ్రామంలోను, ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మునగాల లోను, ఇంటర్మీడియట్ స్నేహ జూనియర్ కళాశాల కోదాడ, డిగ్రీ ఈవీ రెడ్డి డిగ్రీ కళాశాల కోదాడ లోను, బిపిఈడి ప్రొద్దుటూరు లోను, ఎంపీఈడి ఉస్మానియా యూనివర్సిటీ లోని అభ్యసించారు. ఎంపీడీ కోర్సు పూర్తయిన తర్వాత ఎమ్మెస్సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి గురుకుల పాఠశాలలోనూ, గురుకుల కళాశాలలోనూ రెండింటిలోనూ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు. ర్యాంకు రావడం పట్ల ఉస్మానియా యూనివర్సిటీ లో తన సహచర మిత్రులు తమ అధ్యాపకులు ప్రశంసించారు. గ్రామంలోని తన మిత్రులు,గ్రామ ప్రజలు నాయకులు, వివిధ హోదాలలో ఉద్యోగాలు సాధించిన తన గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
-----------------------
Admin