సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏరియాలోని, కొత్తూరు మునిసిపాలిటీ 6 వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాం ను సడన్ విజిట్ చేశారు. మున్సిపాలిటీలోని ఆరవ వార్డు కౌన్సిలర్ వీరమోని హేమ దేవేందర్ తో మాట్లాడుతూ.. కంటి వెలుగు పరీక్షల కోసము మీ వార్డులోని 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరిని క్యాంపు కు పంపించాలని తెలియజేశారు. కంటి వెలుగు క్యాంపు ఈనెల 28వ తారీఖున ముగియ నున్నందువలన, ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు చేసుకొని, వారికి కావలసిన రీడింగ్ గ్లాసెస్ తీసుకోవాల్సిందిగా డాక్టర్ ఎస్ జయలక్ష్మి ల్ తెలియజేశారు. అక్కడికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్ తో మాట్లాడుతూ.. అందరూ కూడా తొందరపడకుండా, నెమ్మదిగా, వారి యొక్క ప్రాబ్లం చెప్పి, కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. అలాగే ఎవరికైనా కాట్రాక్ట్ ప్రాబ్లం ఉన్నట్లయితే, వారికి ఆపరేషన్ నిమిత్తము హైదరాబాద్ సరోజినీ దేవి ఆసుపత్రికి పంపిస్తారని తెలియజేశారు. దగ్గర చూపు, దూరపు చూపు ఇబ్బంది ఉన్నవారికి, ప్రిన్సుప్షన్ గ్లాస్సుకు ఆర్డరు ఇస్తారని డాక్టర్ జయలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ వీరమోని హేమ దేవేందర్, కంటి వెలుగు డాక్టర్ సరిత, ఆప్తమాలజిస్ట్ గోవర్ధన్, కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హరి కిషన్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, ఏఎన్ఎం సులోచన, ఆశలు పాల్గొన్నారు.
-----------------------
Admin