సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో జిఎస్పి జిల్లా స్థాయి సంయుక్త సమావేశం రేగ గణేష్ అధ్యక్షతన. రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర హాజరై మాట్లాడుతూ ఐటీడీఏ ఏటూరునాగారం లో ఏఒ హోదాలో పని చేస్తున్న లాంగ్ స్టాండింగ్ అధికారి ఐటిడిఏ విధుల పట్ల, ట్రైబల్ సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ సమయ పాలన పాటించకుండా కార్యాలయానికి రాకుండా తన ఇష్టరాజ్యంగా వ్యవరిస్తున్నరని అన్నారు. సోమవారం నాడు కొత్తగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి విధుల్లో చేరిన కూడా లెక్క చేయకుండా మధ్యాహ్నం సమయంలో కార్యాలయం నుండి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారని ఇలాంటి అధికారులు గిరిజనులకు ఏం చిత్తశుద్ది తో పని చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరైనా తన మీద పిర్యాధు చేస్తే వారిని స్థానిక రాజికియ నాయకులతో చెప్పి బెదిరించడం జరుగుతుందని అన్నారు.లేని పక్షాన వారి కి మర్యాదలు చేసి తన కబంధస్థాల్లోకి తెచ్చుకొని కార్యాలయంలో తనకు ఎదురు చెప్పేవారు లేకుండా చేస్తూ ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కార్యాలయంలో విధులు మొదలు పెట్టిన దగ్గర నుండి ఎక్కువ కాలం ఏటూరునాగారం ఐటిడిఏ లోనే పని చేశారాని ఇతనికి రాజకీయ అండతో మంచి సంబంధాలు పెట్టుకొని తన పై ఎవరూ ఆరోపణలు చేయకుండా చూసుకొని కార్యాలయంలో ఆర్ధిక లావాదేవీలకు పాల్పడుతూ అక్రమ బిల్లులు పెట్టుకొని లక్షల రూపాయల గిరిజనుల సొమ్మును గడుస్తున్నరని ఆరోపించారు.5 వ షెడ్యూల్ ప్రాంతంలో వడ్డీ వ్యాపార నిషేధిత చట్టం ఉన్నా గిరిజనేతర వ్యాపారులకు డబ్బులకు కక్కుర్తి పడి ఐటిడిఏ ద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఒసి) లు ఇప్పిస్తూ చట్టాలను తన అవసరాల కోసం చుట్టాలుగా మార్చుకొని అనేక రకాల ఇల్లీగల్ దందాలు చేస్తూ గిరిజనుల అభివృద్ధికి గుడిబండ గా మారారని తెలియజేశారు.గిరిజన ఇసుక సొసైటీలలో కూడా కాంట్రాకర్ల ద్వారా తన వాటా తనకు ఇవ్వకుంటే కార్యాలయం నుండి ఫైల్ ముందుకు కదలదని తెగేసి చెప్పడం చాలా విడ్డూరం అని అన్నార.ఏఒ ని తక్షణమే ఐటిడిఎ నుండి మైదాన ప్రాంతానికి బదిలీ చేసి,పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అధికారులు కార్యాలయానికి సమయ పాలన ప్రకారం విధులకు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకొని గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రి సీతక్క చొరవ తీసుకోవాలని కోరారు . లేని పక్షంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ముట్టడిస్తామని హెచ్చరించారు.సమావేశంలో జిల్లా వర్కింగ్ పెసిడెంట్ పూనెం ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి కనితి వెంకటకృష్ణ, పాయం కృష్ణ తదితరులు ఉన్నారు.
-----------------------
Admin