సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కేరళలోని వాయనాడ్‌లోనూ పోటీ చేసిన రాహుల్ వాయనాడ్‌లో మాత్రం ఘన విజయం సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్ అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు. అయితే ఈసారి వాయనాడ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షం సీపీఐ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి అనీ రాజాను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో యూపీ అమేథీ నుంచి రాహుల్ తిరిగి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు. బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాదిలోనే రాహుల్ పోటీ చేయాలని ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలు సూచిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో అమేథీ ఓటమి మిగిల్చిన చేదు అనుభవాల రీత్యా దక్షిణాదిన ఒక సేఫ్ సీట్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. రాహుల్ పోటీ చేసేందుకు ఖమ్మం సరైన నియోజకవర్గమని టీపీసీసీ కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తోంది. అయితే రాహుల్ ఎక్కణ్ణుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంతవరకు పార్టీ హై కమాండ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడితే.. ఆయనపై ఎవరిని బరిలోకి దించాలన్న విషయంపై టీ బీజేపీ కసరత్తు చేస్తోంది. రాహుల్ గాంధీని స్మృతీ ఇరానీలా ఢీకొట్టగలిగే నేత కోసం కమలనాథులు యత్నాలు ముమ్మరం చేశారు...
-----------------------
Admin