సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : దామరగిద్ద మండలంలోని కానుకుర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాగరాజు పూర్వ విద్యార్థి వాళ్ళ అమ్మ కి|| శే || ఇందనురు కిష్టమ్మ వారి జ్ఞాపకార్ధంగా కానుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీషు ( Spocken english) తరగతులను బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్, కండక్టర్ రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, మరియు ఈ వేసవి సెలవుల్లో45రోజుల పాట స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించబడనని, ఇట్టి తరగతులకి ఈ ప్రోగ్రాం కి ఏటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదని పూర్తిగా ఉచిత మెటీరియల్ మరియు ఉచిత క్లాసులు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానుకుర్తి గ్రామంలో ఈ స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు అనుభవం గల అధ్యాపకులచే నిర్వహించబడునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్రాములు, శ్రీనివాస్, మరియు వాలంటరీలో శరణ్ రెడ్డి, మోనేష్, మాహేష్, మౌలానా తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin