సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట పరిధిలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఎలక్షన్లలో గెలుపు ఓటములు సహజమని అందరూ కూడా కౌంటింగ్ తర్వాత ఎప్పటిలాగానే కలిసిమెలిసి ఉండాలని ఎటువంటి గొడవలు పడవద్దని డాక్టర్ ఎస్పీ వినీత్ జి మరియు డిఎస్పి అబ్దుల్ రెహమాన్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రింది నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎవరు కూడా హింసాత్మకమైన చర్యలకు పాల్పడకూడదు. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలుపొందిన పార్టీకి చెందినవారు ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు విజయోత్సవాలు వంటివి చేయరాదు... బానసంచాలు, టపాకాయలు కాల్చకూడదు, మరియు DJ లు లౌడ్ స్పీకర్స్ పెట్టకూడదు. సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలను కానీ మరియు ఇతర రాజకీయ పార్టీ వ్యక్తులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టరాదు... నలుగురు కన్నా ఎక్కువ వ్యక్తులు గుమి కూడి ఉండరాదు 144 సెక్షన్ అమలులో ఉన్నది... అభ్యర్థుల గెలుపు / ఓటమి గురించి ఎవరైనా బెట్టింగ్ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయబడును. పోలీస్ హెల్ప్ కోసం డయల్ 100 కి కాల్ చేయగలరు అని ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని తెలియజేస్తూ హెచ్చరించారు....
-----------------------
Admin