సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దళిత గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అదేవిధంగా వారి సంక్షేమం కోసం డిక్లరేషన్ ప్రకటించబోతున్నామని తెలంగాణ కాంగ్రెస్ షాద్ నగర్ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘు పేర్కొన్నారు. రేపు 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని వివరించారు. ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ఖర్గే విడుదల చేస్తారని రఘు చేశారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను నమ్మించి వంచిందని అన్నారు దళితున్ని సీఎం చేస్తామని చేయలేదని దళిత గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ కమిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు నిధులు వృధా అవుతున్న ఇతర కార్యక్రమాలకు వాడుకుంటున్న అడిగే దిక్కే లేకుండా పోయిందని అన్నారు. విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాల్లో ఎస్సీ ఎస్టీలు ఎన్నో రకాలుగా అన్యాయాలకు గురయ్యారని ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే డిక్లరేషన్ ఊరట కల్పిస్తుందని అన్నారు. చేవెళ్ల సభకు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ ప్రజలు తరలిరావాలని ఈ సందర్భంగా
-----------------------
Admin