సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు గానీ పాలకులు గానీ రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండలేరని కుల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూ రం అభినవ్ అన్నారు. ఆదివారం జన విజ్ఞాన వేదిక, ప్రోగ్రెసివ్, సమూహ రైటర్స్ ఫోరం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామాజికవేత్త డాక్టర్ రాజు అధ్యక్షతన 75 ఏళ్ల భారత రాజ్యాంగం సవాళ్లు అనే అంశంపై చర్చా వేదిక ఆదివారం స్థానిక మిర్యాలగూడలోని బీసీ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా కేఎన్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అభినవ్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే విధానంలో మనిషి మనిషికి తేడాలు ఉన్నాయని సరైన విధానంలో ఆలోచించినట్లయితే రాజ్యాంగం అందరికీ సమన్యాయాన్ని కల్పించిందని అన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ మువ్వా రామారావు మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు పోస్టులు పెడుతున్నారని రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకున్నట్లయితే రాజ్యాంగ విలువలు తెలుస్తాయని సరైన అవగాహన లేకుండా పోస్టులు పెట్టడం తగదని అన్నారు. విద్యావంతుల వేదిక అంబటి నాగయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి పార్లమెంటుకు సమర్పించేటప్పుడు భారతదేశ ప్రజలమైన మేము తమకు తాముగా ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము అని అనడంలోనే ప్రజాస్వామ్యం నిమిడి ఉందని అన్నారు. కార్యక్రమంలో సమూహ రైటర్స్ ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ, కుల వివక్షత పోరాట సమితి నాయకులు రెమడాల పరశురాం, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్ జై కొండల్ రెడ్డి,కోల శ్రీనివాస్, డిటిఎఫ్ గణేష్, మైనార్టీ నాయకులు మౌజం హుస్సేన్, డాక్టర్ సాహితీ, అరుణ, సుజాత, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin