సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ కు కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే వస్తున్నారని పార్లమెంట్ కన్వీనర్ డోకురి పవన్ కుమార్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ అధ్యక్షతన బీజేపీ పార్లమెంట్ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ నెల 19 వ తేదీన కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే షాద్ నగర్ నియోజక వర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నట్టు వారు పేర్కొన్నారు. వివిధ వర్గాలను మేధావులను మంత్రి కార్యక్రమంలో భాగంగా కలుసుకుంటారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, ఏపి మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, విస్తారక్ సాయిబాబా, ఎన్కోనోళ్ల వెంకటేష్, నర్సింలు యాదవ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin