సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వైద్య సేవలు అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని బీఎస్పీ కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ విమర్శించారు.మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా బుధవారం లక్ష్మీదేవిపల్లి,చింతగుప్పు,మందేరుకలపాడు,కారేగట్టు,సరేకల్లు గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ లక్షకు పైగా జనాభా కలిగిన పాల్వంచ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కనీసం అంబులెన్స్ లేకపోవడం బాధాకరమన్నారు.మారుమూల ప్రాంతాలోని ప్రజలకు విషసర్పాలు కాటువేసిన,అత్యవసరంగా వైద్యం అవసరం వచ్చిన సాయంత్రం 4 దాటితే వైద్యలు అందుబాటులో ఉండటం లేదని,విష జ్వరాలు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.ఉల్వనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు.బీఎస్పీ అధికారంలోకి వచ్చాక ఏట రూ.ఇరవై ఐదు వేల కోట్ల ఆరోగ్య బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రతి ముప్పై వేల గ్రామీణ జనాభాకు కొత్త ఆదర్శ ప్రజారోగ్య కేంద్రం,ప్రతి నియోజకవర్గానికి 200 పడకల అంతర్జాతీయ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో పాల్వంచ మండల,పట్టణ అధ్యక్షులు కాటబోయిన వసుంధర,కోళ్ళపూడి ప్రవీణ్,కేతిని కుమారి,ఎర్రంశెట్టి రాజేశ్వరి,వెంకన్న,ఏడెల్లి మర్థమ్మ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin