సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేస్తున్న రక్తదానం శిబిరాన్ని విజయవంతం చేయండి. తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం ప్రాణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది అభాగ్యులకు, పేదలకు సహాయం చేసి అవుతామని అన్నారు. ఖైరుల్ మోమినీన్ ట్రస్ట్ సభ్యులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఈ నెల 13 వ తేది ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని ఇడెన్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో పెద్దఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొని రక్తదానం చేసి తలసేమియా బాధితులను ఆదుకోవాలని అన్నారు.
-----------------------
Admin