సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లో యువ నాయకుడు జగడం కిరణ్ తండ్రిని పరామర్శించిన డాక్టర్ గడాల శ్రీనివాసరావు... GSR ట్రస్టు చైర్మన్ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీలోని 24 వ వార్డులో గల జగడం కిరణ్ స్వగృహంలో ఆయన తండ్రిని పరామర్శించడం జరిగింది. ఇటీవలే GSR ట్రస్టు ఆధ్వర్యంలో తన తండ్రి మిట్టపల్లి లక్ష్మణ్ కి హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసి హాట్ లో స్టంట్ వేయడం జరిగింది. అయితే ఈరోజు ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ప్రాంతానికి తనకు ఎంతో అభినవ సంబంధం ఉందన్నారు. తాను పుట్టింది పెరిగింది ఈ ప్రాంతంలోనైనా అని అన్నారు. బాల్యం ఇక్కడే గడిచింది అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతనికి సేవ చేసుకుంటా అన్నారు. ఎవరైనా ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోయినా డబ్బు పెట్టుకునే స్తోమత లేని వారికి తన చాతనైన వరకు సాయం చేస్తా అన్నారు.పుట్టిన ప్రాంతానికి ఎంతో కొంత రుణం తీర్చుకుంటా అని అన్నారు. ఈ కార్యక్రమంలో బస్తివాసులు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin