సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ : దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ దళిత జర్నలిస్టు ఫోరం మండల అధ్యక్షులు దానూరి శ్రీనివాస్ ఏపీజీవీబీ బ్యాంకుకు రూ.8500 విలువ గల వాటర్ డిస్పెన్సర్ యూనిట్ మంగళవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ పాల్గొన్నారు. అనంతరం బ్యాంకు సిబ్బందితో కలిసి యూనిట్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు నీటి వసతి కల్పించాలని మంచి ఆలోచనతో యూనిట్ అందజేయడం జరిగిందని అన్నారు. బ్యాంకుకు వచ్చే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమం నిర్వహించిన దానూరి శ్రీనివాస్ ను బ్యాంకు మేనేజర్ రాచబంటి నరేష్ అభినందించారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రాచబంటి నరేష్,క్యాషియర్ పడాల నాగరాజు,బ్యాంకు సిబ్బంది సురేష్ బాబు మరియు దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నకుమార్ పాల్గొన్నారు...
-----------------------
Admin