సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భద్రాచలంలో శనివారం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కొత్తగూడెం వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి గారి స్వగృహానికి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి గారి పార్థివ దేహానికి పూలమాలవేసి, ఘన నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, గుండె ధైర్యం చెప్పి వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆమె మరణించడం చాలా బాధాకరమనీ కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి గారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వనమా వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, బిఆర్ఎస్ నాయకులు పూర్ణ, కేకే శీను, మల్లెల ఉషారాణి, కూరపాటి సుధాకర్, వెంకట్ యాదవ్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin