Friday, 31 July 2026 09:57:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాబోయే రోజుల్లో బిఆర్టియు ఆధ్వర్యంలో ఐటీసీలో గులాబీ జెండా ఎగురుతుంది...

Date : 30 June 2023 12:27 AM Views : 501

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ పిఎస్ పిడి బిఆర్ టియూ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ పాల్గొన్నారు. ఐటీసీ కార్మికుల, కార్యకర్తల సమావేశం సారపాక లోని వాసవి ఫంక్షన్ హాల్ నందు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బి రాంబాబు యాదవ్ మాట్లాడుతూ ఇతర కంపినిలలో జిత భత్యాల తో పోలిస్తే తక్కువగానే ఐటీసీలో ఉన్నాయన్నారు. కార్మికులు భవిషత్తు మారలేదన్నారు. నేతలు మాత్రమే అభివృద్ధి చెందారు అనటానికి లక్ష్మీపురం లో వెలుస్తున్న గోడౌన్లే ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు. కార్మికుల పక్షాన పనిచేసేవాడే కార్మిక నాయకుడు అవుతాడు స్వార్థంతో పనిచేసే నాయకుడే కార్మిక సంఘం నేత అన్నారు. కేసీఆర్ కార్మికుల వేతనాలు పెంచాలని, పెంచడానికి ఆయన ముందు ఉంటారు అని అన్నారు. బి ఆర్ టి యు అధ్యక్షుడు స్థానికుమ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీలో పాల్గొని ఉన్న నాయకులేకార్మికులతో మమేకమై 191 ఓట్లు సాధించామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కేసిఆర్ ఆశీర్వచనాలతో రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో గులాబీ జెండా ఐటిసి కర్మాగారంలో ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు అగ్రిమెంట్లు అస్తవ్యస్తంగా కార్మికులకు నష్టం కలిగించే అగ్రిమెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసిన అగ్రిమెంట్లలో కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదని కేవలం కార్మిక సంఘాల నేతలు అభివృద్ధికి మాత్రమే దోహదపడ్డాయని ఎద్దేవ చేశారు. రాబోయే కాలంలో గులాబీ జెండా ఐటిసి లో ఎగురుతుందని, ఆనాడు మన కార్మిక సంఘం తరపున జరిగే అగ్రిమెంటు శాశ్వతంగా భద్రాచలం యూనిట్లో కొనసాగేలాగా చేస్తామని ఆ అగ్రిమెంట్ మాత్రమే కార్మికులకు న్యాయం జరుగుతుందని కార్మికుల అభివృద్ధి చెందుతారని అటువంటి అగ్రిమెంట్ చేయటానికి అందరూ కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఐటీసీ కరుణా గారు అభివృద్ధి చెందుతూ ఉందని కార్మికుల జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. దినదినాభివృద్ధిగా ఐటీసీ కర్మాగారం జరుగుతున్న కార్మికుల జీవితాలు మాత్రం దినదినాభివృద్ధి చెందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం కార్మిక సంఘాల నేతలు మాయమాటలు చెబుతూ ఓట్లు వేయించుకుంటూ ఉన్నారని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన అగ్రిమెంట్లు అన్నీ కూడా కార్మికులకు ఎటువంటి లాభదాయకంగా లేవని రోజు రోజుకి కర్మాగారం పెరుగుతున్న ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు స్థానికులకు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీసీ కరుణాగరంలో ఎన్నో అగ్రిమెంట్లు జరిగాయని వాటిల్లో తాను కూడా పాల్గొని అగ్రిమెంట్లు చేసిన దాఖలాలు ఉన్నాయని నాయకుడు అజీమ్ అన్నారు. ఏ అగ్రిమెంట్ చూసిన కేవలం నేతల భవిష్యత్తు మారింది గాని కార్మికుల భవిష్యత్తు మారలేదని ప్రతి ఎన్నికలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురిచేసి గెలుస్తున్నారని కేవలం రెండు యూనియన్లు మాత్రమే ఈ ప్రాంతంలో ప్రతిసారి గెలవటం అగ్రిమెంట్లు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగరవేయడానికి అందరూ కలిసికట్టుగా పని చేద్దామని కార్మికుల జీవితాలు మారే విధంగా రాబోయే అగ్రిమెంట్లు చేస్తామని ఈ అగ్రిమెంటే శాశ్వతంగా ఐటిసి కర్మాగారంలో ఉంటాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఐటీసీ కార్మికులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :