Thursday, 30 July 2026 11:48:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సత్తుపల్లిలో అక్రమ మట్టి దందా...

Date : 06 March 2023 12:03 AM Views : 925

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి మండల పరిధిలోని కొమ్మేపల్లి, లింగపాలెం, కిష్టారం, రెవిన్యూ సరిహద్దు ప్రాంతం నుంచి వందలాది టిప్పులు అక్రమంగా మట్టి తరలిస్తున్న రెవెన్యూ , స్థానిక పోలీస్ శాఖ అధికారులు, అటు వైపు కన్నెత్తి చూడలేకపోవటం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతమైన కొమ్మేపల్లి , లింగపాలెం, సింగరేణి సంస్థ నుంచి నష్టపరిహారం పొందిన కొమ్మేపల్లి, లింగపాలెం రెవెన్యూ పరిధి లో వ్యవసాయ వ్యవసాయ భూమిని రైతులు వద్ద నుంచి సింగరేణి సేకరించినప్పటికీ, కొంతమంది రైతులకు సింగరేణి పరిహారం అందజేసి మరి కొంతమంది రైతులకు జాప్యం చేయటంతో ఆ రెవిన్యూ పరిధిలోని స్థానిక రైతులకు, మట్టి మాఫియా, డబ్బులను ఆశగా చూపి, ఎలాగో సింగరేణి పరిహారం మీకు అందుతుంది కదా, దానికి తోడు నీకు ఎంతో కొంత డబ్బు మూట్ట చెబుతామని ఆశ చూపి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు, స్థానిక రైతులు వాపోతున్నారు, ఆ రెవెన్యూ పరిధిలోని ప్రత్యేకమైన రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకొని రాత్రి పగలు తేడా లేకుండా వందలాది టిప్పుల మట్టి తరలిస్తున్న రెవిన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వారి అసమర్థతను స్థానిక ప్రజలు బేజారు వేసుకుంటున్నారు, మట్టి తరలింపు పై దిశ దినపత్రిక పలు సంచలన కథనాలు ప్రచురించిన తర్వాత రెండు మూడు రోజులు నిలుపుదల చేసి మరల యధావిధిగా వందలాది టిప్పుల మట్టి తరలించేందుకు మట్టి మాఫియా సిద్ధమయ్యారని చెప్పవచ్చు. రెవిన్యూ పోలీస్ అధికారుల అండదండలతో పాటు స్థానిక ప్రముఖ రాజకీయ నాయకులను పేర్లు వాడుకొని స్థానిక అధికారులను మధ్యలో పెడుతున్నట్లు మాకు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడు తెలుసు మేము దగ్గర బంధువులు మేము ఫలానా నాయకులకు చాలా దగ్గర బంధువులను అని అధికారులను మభ్యపెడుతున్నట్లు, అధికారులు పలుమార్లు ఉచ్చరించటం శోషనీయం, మట్టి మాఫియాకు వెనుక ఉండి ఈ తంతంతా నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం, కోమ్మేపల్లి పరిధి నుంచి సింగరేణి జిఎం కార్యాలయం మీదుగా సత్తుపల్లి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు నుంచి పదుల సంఖ్యలో టిప్పర్లు మట్టి తరలిస్తున్న రెవెన్యూ అధికారులు కంటికి కనపడకుండా లేదనటం విశేషం, రెవిన్యూ పోలీస్ అధికారుల అండదండలతోనే మట్టి మాఫియా వేల సంఖ్యల తిప్పుల మట్టిని తరలిస్తున్నట్లు, బేతుపల్లి, తాళ్లమడ రెవిన్యూ పరిధిలోని వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ భూమి గా మార్చేందుకు వందలాది లారీలతో వేలాది టిప్పులు మట్టి తరలిస్తున్న అధికారులు మొద్దు నిద్ర వీడం లేదు, పదుల సంఖ్యలో టిప్పర్లను సత్తుపల్లిలో అధిక స్పీడ్ తో తోలుతూ గతంలో రెండు మూడు పర్యాయములు సత్తుపల్లి పట్టణంలో ప్రమాదాలకు కారణమైన కానీ అధికారులు వీరి తీరని పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియా మట్టిని తరలించే టిప్పర్లకు సరైన పత్రాలు, తోపాటు డ్రైవర్లకు లైసెన్స్ లేదని ఆంధ్ర పర్మిట్ తో తెలంగాణలో నడుపుతున్నట్లు స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు, కొమ్మేపల్లి , లింగపాలెం, రెవిన్యూ పరిధిలోని వ్యవసాయ చేసుకున్న రైతులు మట్టి మాఫియా భారీ నుండి మమ్మును మా పంటలను కాపాడాలని వేడుకుంటున్నాను, ప్రభుత్వ ఉపాధ్యాయుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి మట్టి మాఫియా తో చేతులు కలిపి తెర వెనక నుండి ఈ తంతంతా నడిపిస్తున్నట్లు సత్తుపల్లి ప్రజలు నుంచి వినపడుతుంది, సత్తుపల్లి ప్రజానీకం ఉపాధ్యాయుడు తీరు చూసి స్థానిక ప్రజలు విషమయం వ్యక్తం చేస్తున్నారు, స్థానిక రెవెన్యూ, పోలీస్, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులు స్పందించి వీరిపై కఠినమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలతో పాటు వివిధ గ్రామాల రెవిన్యూ పరిధిలోని రైతులు వేడుకుంటున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :