Friday, 31 July 2026 01:53:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ అసెంబ్లీ బరిలో బిజెపి తరఫున దరఖాస్తు చేసుకున్న ఏపీ మిథున్ రెడ్డి...

Date : 10 September 2023 09:29 AM Views : 266

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర యువనాయకుడు ఏపీ మిథున్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో తన అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు షాద్ నగర్ సిటీటైమ్స్ మీడియా ప్రతినిధికి తెలిపారు. మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి రాజకీయ వారసుడైన ఏపీ మిథున్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గం నుండి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఆయన వెంట బిజెపి సీనియర్ నాయకులు పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఏపీ మిథున్ రెడ్డి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఎలక్షన్ క్యాంపెయిన్ 2019 పార్లమెంటరీ ఎన్నికలలో కీలక పాత్ర పోషించారు. చేవెళ్ల (అసెంబ్లీ) ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా క్రియాశీల పాత్ర పోషించారు, హుజూర్‌ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, మరియు మునుగోడు ఉప ఎన్నికలతో పాటు జిహెచ్‌ఎంసి, షాద్‌నగర్ నియోజక వర్గం జెడ్‌పిటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 5 దశలకు ప్రచారతల ప్రబంధక్ గా వ్యవహరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఎన్ఈసీ సమావేశం మరియు ఖమ్మం అమిత్ షా సభ కోసం వేదిక మరియు అలంకరణ ఇంచార్జిలలో మిథున్ రెడ్డి ఒకరుగా ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో షాద్‌నగర్‌లో అత్యవసరమైన అవసరమైన మస్కులు , హ్యాండ్ శానిటైజర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేయడం ద్వారా కీలకమైన సహాయాన్ని అందించారు. మరియు అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు. గ్రాస్‌రూట్ ప్రచారం.. ప్రజా గోస బీజేపీ భరోసా - స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, రాష్ట్రం నియోజక వర్గం అంతటా అన్ని పార్టీ కార్యకలాపాలో పాల్గొన్నారు. చాలాకాలంగా మిథున్ రెడ్డి షాద్ నగర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఒక ఇంటిని కూడా నిర్మించుకున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :