సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్యపై రేగా కాంతారావు తీరు సరికాదు బిఆర్ఎస్ నాయకులు సభా మర్యాద నేర్చుకోవాలి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం ( ) సభా మర్యాద లేకుండా ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కు అధ్యక్షత ఇవ్వకుండా అధికార పార్టీ విప్ అన్న అహంభావంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పై బిఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నం చేయడం సరైన చర్య కాదని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానగర్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలా భావించి గతంలో ఎవరు చేయని అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీ చేసినట్టు ప్రచారం చేసుకోవడంతో పాటు గత 2 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కేవలం 1 సీటు మాత్రమే దక్కించుకున్న పార్టీ నేడు భద్రాచలంలో కూడ గెలుపు మాదే అనడం హస్యాస్పదం అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రణాళికలు, అందించిన సంక్షేమ ఫలాలు రేగా కాంతారావు మర్చిపొతే ఆయన నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన కనపడతాయని, ఒకవేళ అవి ఆయనకు కనపడకపొతే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న కంటి వెలుగు శిబిరంలో పరీక్ష చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని లేకుంటే అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని జిల్లా అధికారులను హెచ్చరించారు. భద్రాచలాన్ని స్వార్థం కోసం మూడు ముక్కలు చేసిన బిఆర్ఎస్ పార్టీకి భద్రాచలం ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. మరొకసారి డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపల్లి శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ కరీం పాషా, ఓబీసీ జిల్లా సెక్రటరీ బాలు భద్రరావు, యువజన కాంగ్రెస్ నాయకులు తేజావత్ సాయి పాల్గొన్నారు...
-----------------------
Admin