సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో కొలిమి బజర్ లో గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒవరవడి వైసిపిని విజయతీరాల ధరికి చేరుస్తాయని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో ఎంపీపీ పర్వీన్ షామీర్ భాష అధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మనప్రభుత్వం - కార్యక్రమానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అపూర్వస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలిమి బజార్ లో ప్రజలతో మమేకమై ప్రతి గడపను సందర్శించి రాష్ట్ర ముఖ్య మం తి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసు కున్నారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రానట్లయితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం జగన్నాథరథచక్రాల వలే పురో గమణదిశగా దూసుకుపో తోంద న్నారు. నాలుగేళ్ల పాలనలో విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్య తనిస్తూ అన్ని వర్గాలకు హితోధికంగా సంక్షేమ పథకాలను ఇచ్చి సహాయ సహకారాలు అందించిన ఘనత తమప్రభుత్వానికే దక్కిందన్నారు. నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలను ఆధునీకరణ చేసి విద్యార్థిని, విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యాబోధనను అందిస్తున్న ఘనత జగన్కో దక్కిందన్నా రు. బూజూస్ యాప్ ను ట్యాబులలో అనుసం ధానం చేసి విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన జగనన్నకే చెల్ల మన రాష్ట్రాని కి భవిష్యత్ లో అందచందాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్చిదిద్దు తున్నాడన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తుమ్మల పర్వీన్ భాను, జడ్పిటిసి దామోదర్ రెడ్డి, వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు తుమ్మల షామీర్ భాష, ఓ డి సి పట్టణ కన్వీనర్ కోళ్ళ కృష్ణారెడ్డి, సచివాలయ కన్వీనర్లు, సర్పంచ్ గోవిందు, ఎంపిడిఒ పోలప్ప. తహశీల్దార్ శ్రీధర్, ఈ ఓ ఆర్ డి రాజశేఖర్, మండల విద్యాధికారి ఖాదర్ వలీ భాష, మండల వ్యవసాయ అధికారి ఇంతియాజ్ అహ్మద్, విద్యుత్ ఏఈ రామసూరారెడ్డి , గ్రామ కమిటీ అధ్యక్షుడు మండోజి ఆరిఫ్ ఖాన్, తిప్పేపల్లి సర్పంచ్ రామచంద్ర రెడ్డి, మండల అగ్రి అడ్వెంచర్ చైర్మన్ లక్ష్మిరెడ్డి, తుమ్మల బాబా, జోలి బాబా, బాలు , వైయస్సార్సీపి నాయకులు,కార్యకర్తలు , వాలంటరీలు, అభిమానులు,పాల్గొన్నారు...
-----------------------
Admin