Thursday, 30 July 2026 11:50:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్‌ టికెట్ల కోసం రచ్చరచ్చ...

Date : 29 October 2023 10:50 AM Views : 395

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : జూబ్లీహిల్స్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు శనివారం గాంధీభవన్‌ను ముట్టడించారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో గాంధీభవన్‌ సిబ్బంది ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. మరింత ఆగ్రహానికి గురైన నిరసనకారులు, గాంధీభవన్‌ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు, ఇటుకలతో గాంధీభవన్‌పై దాడి చేశారు. అక్కడ ఉన్న రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను చించేశారు. కాంగ్రెస్‌ జెండాలను తగులబెట్టారు.... కాంగ్రెస్‌ టికెట్లు దక్కని ఆశావహులు, వారి అనుచరులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ టికెట్‌ శ్యాంనాయక్‌కు కేటాయించడంతో ఆ పార్టీ ఆశావహులు మర్సుకోల సరస్వతి, గణేశ్‌ రాథోడ్‌ శనివారం ఆసిఫాబాద్‌లో ధర్నా నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నారాయణరావు పటేల్‌కు టికెట్‌ ఇవ్వటంతో భైంసాలోని పార్టీ కార్యాలయంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ కిరణ్‌ కొమ్రేవార్‌ అనుచరులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయ బోర్డు, పోస్టర్లు, ఫ్లెక్సీలను చించివేశారు. వడ్డేపల్లి సుభాష్‌రెడ్డికి ఎల్లారెడ్డి టికెట్‌ కేటాయించక పోవడంతో నాగిరెడ్డిపేట కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు రాకేశ్‌ ఆత్మహత్యకు యత్నించాడు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీసీ సంఘం, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రేవంత్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: