సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం లోని వి ఆర్ కె పురం గ్రామ పంచాయితీ లో వాస్తవ్యులు డర్ర సునీత, రాచపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర వలన తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదం లో డర్ర సునీత ఎడమ కాలు పూర్తి గా కోల్పోయినది.విషయం తెలుసుకున్న మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు తక్షణం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా అమె గురించి భారతీ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ సంప్రదించగా వెంకటాపురం పోలీసు శాఖ సహకారంతో క్రృత్రిమ కాలు నిన్న అమర్చడం జరిగింది. ఈసందర్భంగా బాధిత మహిళ ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ కి సహకిరించిన పోలీస్ శాఖ వారికి క్రృతఘ్నతలు తెలిపారు. కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మన్ చిడెం మోహన్ రావు,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్,ముద్దు కూరి ప్రసాద్ రమేష్,డర్ర రవి బాధితురాలి భర్త మహేష్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin