సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కొండకమర్లలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి . ఈ సందర్బంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కోసం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన క్రియా శీలక సభ్యత్వం ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం వలన ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పార్టీ ఇవ్వడం జరుగుతుందని తెలపారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరిన లాయర్ ప్రవీణ్,జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ పోరాటాలు రైతులకు చేస్తున్న కార్యక్రమాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఈశ్వర్, కార్యదర్శులు ధనుంజయ, ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, కొండబోయన సతీష్, అల్లాడి జయరాం, పూల శివప్రసాద్, మహేష్, పెద్దన్న, నరేంద్ర, చక్రపాణి, శంకర్, సద్దాం, ఉపేంద్ర, శ్రీనివాసులు జనసైనికులు పాల్గొన్నారు...
-----------------------
Admin