Thursday, 30 July 2026 02:34:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలి...

Date : 05 September 2023 07:24 AM Views : 295

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిద ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎండార్స్ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు నిషిత పరిశీలన చేయాలని, ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని : పినపాక మండలం, భూపాలపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ కొర్స కృష్ణంరాజు సర్వే నెం. 765లో రెండున్నర కుంటల భూమి ఆర్, ఇద్దరు విఆర్ఎల సమక్షంలో సర్వేయర్ 4-7-2023న సర్వే చేసి పంచనామా ఇవ్వకుండా ఒక నెల తరువాత 31-8-2023న ఇచ్చారని, 1.9.2023న సర్వేయర్ ఆ భూమి 739 సర్వే నెంబర్లో ఉన్నదని చెప్పారని, ఎందుకు వ్యత్యాసం వచ్చిందో విచారణ నిర్వహించి నివేదికలు అందచేయాలని పినపాక తహసిల్దారు ను ఆదేశించారు. మణుగూరు మండలం, బండారుగూడెం ఆదర్శనగర్ కు చెందిన చల్లా నర్సయ్య తన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జా చేసి వృద్ధుడైన తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదు ను పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం మణుగూరు తహసిల్దార్కు ఎండార్స్ చేశారు. ముల్కలపల్లి మండలం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన కారం దావీద్ రామచంద్రాపురం నందు రెండు వాటర్ ట్యాంకులు ఉన్నా తాగునీటి సౌకర్యం ఆగమ్యగోచరంగా ఉందని, వర్షాలు వచ్చినపుడు వెలుగుతున్నాయని, మామూలు టైంలో రావట్లేదని, డ్రైనేజి వ్యవస్థ గురించి పట్టించుకోవడం లేదని, బ్లీచింగ్ కూడా చల్లడం లేదని పేర్కొంటూ చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు. చండ్రుగొండ మండలం, తిప్పనపల్లితండాకు చెందిన సర్వే నెం.146/16/1లో ఉన్న భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ ఈ సెక్షన్ పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు. మణుగూరు మండలం, కూనవరం గ్రామానికి చెందిన చెక్కా రమేష్ నిరుపేద కుటుంబానికి తనకు దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఎస్సి కార్పోరేషన్ ఈడికి ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం, పునుకుల గ్రామానికి చెందిన భూక్యా శారద దేవిజతండాలోని మిని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ తన అత్త భూక్యా పాతిలి అనారోగ్య కారణాలతో గత నెల 3వ తేదీన మరణించారని, అట్టి పోస్టును తనకు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :