సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అన్న ఆదరణే చెల్లికి మనో ధైర్యం.. ఈ జగత్తులో బంధానికి మూలమే రక్త సంబంధం.. అదే అన్నా చెల్లెల అనుబంధం. అన్న వస్తున్నాడంటే సంబురం. చెల్లి అడుగు పెట్టిందంటే వేడుక. చేతినిండా రాఖీలు, నోటినిండా మిఠాయిలు, గుండెనిండా అనురాగాలు, దోసిళ్లనిండా కానుకలు.. జీవితానికి ఇంతకుమించి సంతృప్తి ఏం కావాలి..? భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఇంట రాఖీ పూర్ణిమ పండగ శోభ సంతరించుకుంది. ఏపీ జితేందర్ రెడ్డి ఆయన తమ్ముడు ఏపీ నరేందర్ రెడ్డిల సోదరీమణులు జయప్రద, జయశ్రీ, ప్రేమ, లలితలు వారికి రాఖీ కట్టి సోదర ప్రేమను చాటుకున్నారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి తనయులు రాష్ట్ర బిజెపి రాష్ట్ర యువనాయకులు ఏపీ మిథున్ రెడ్డి, సంజయ్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, లకు వారి సోదరీమణులు స్వాతి రెడ్డి, హిమబిందులు రాఖీలు కట్టారు. ప్రత్యేక జరిగే రాఖీ పండుగ సందర్భంగా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య రాఖీ బంధల పర్వదినం ఎంతో గొప్పగా జరుపుకుంటామని యువ నాయకులు రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య వాత్సల్యంతో రాఖీ పండుగ గొప్పగా జరుపుకోవాలని ఏపీ మిథున్ రెడ్డి మీడియా ద్వారా ప్రజలను కోరారు.
-----------------------
Admin