సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాదులో యూపీవీసీ కాంట్రాక్టర్ గా చేస్తున్నాడు. భార్యతో కలిసి మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 27న ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి తిరిగి రాలేదు. అదే రోజు 8 గంటల 40 నిమిషాలకు తన తండ్రి నాగిరెడ్డి తో మాట్లాడారు. అనంతరం అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తుండగా ఖత్వ చెరువులో మృతదేహం గుర్తించినా స్థానికులు పోలీసు వాళ్లకి సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు శ్రీకాంత్ రెడ్డి బలస్కారానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
-----------------------
Admin