Saturday, 01 August 2026 07:22:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతులపై జరిపిన కాల్పులను ఖండిస్తూ నిరసన కార్యక్రమం...

Date : 23 February 2024 05:10 AM Views : 320

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ మండలo రెడ్డిగూడెం లో సంయుక్త కిసాన్ మోర్చ (SKM) పిలుపు మేరకు నిరసన తెలిపడం జరిగింది ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వీరమల్ల ఉమా మాట్లాడుతూ... నిన్న పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద "కనీస మద్దతు ధర(MSP)" ఇతర రైతు డిమాండ్ల అమలుకై శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై,మహిళలపై రబ్బరు బుల్లెట్ కాల్పులు జరపాడాన్ని, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తునాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చిన్న పెద్ద ముసలి ముతక రైతు మహిళా విద్యార్థులు యువకులు అని చూడకుండా విచక్షణ రహితంగా ఏకపక్షంగా కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 23 ఏళ్ల శుభకరన్ సింగ్ అనే యువకుడు రబ్బరు బుల్లెట్లతో కాల్చి చంపబడ్డాడని, దాదాపు 160 మంది దాక గాయాలు అయ్యాయని, నిరసనలు చేస్తున్న యువతను, రైతులను దేశ శత్రువులుగా మోదీ ప్రభుత్వం పరిగణిస్తున్నదని, మోడి అతని RSS మరియు BJP ప్రభుత్వం భారతీయ రైతులను దోపిడీ చేయడానికి కార్పొరేట్, MNCలు మరియు విదేశీ శక్తుల ప్రయోజనాలకు సేవ చేస్తున్నాయని మరియు వారు తమ "కార్పొరేట్ అభివృద్ధి" లక్ష్యానికి ఎంతగానో అక్రమ ఒప్పందం చేసుకున్నారని, ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీల ప్రజావ్యతిరేకతను,జాతీయ వ్యతిరేకతను మరోసారి బహిర్గతం చేసిందన్నారు. కాల్పులకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారిని వెంటనే అరెస్టు చేయాలని, అమరవీరుడు శుభకరన్ సింగ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని SKM డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజలారా ఇప్పటికైనా నరేంద్ర మోడీ నాటకాలని బహిర్గపరుస్తూ ఈ ఎన్నికలలో గ్రామాలలోకి రానివ్వకుండా బిజెపిని గ్రామ బహిష్కరణ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,ఐ ఎఫ్ టి యు,పి డి ఎస్ యు,POW నాయకులు జక్కుల లింగయ్య,వీరమల్ల మల్లయ్య,తుక్కాని లక్ష్మణ్ రెడ్డి,కానబోయిన ఉపేంద్ర,కళింగారెడ్డి మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: