సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలం చిట్టా పూర్ గ్రామంలో మంగళవారం రోజున రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బాల్కొండ బిఆర్ఎస్ నాయకులు తెలిపారు.బాల్కొండ మండలం చిట్టాపుర్ గ్రామంలో పలు కుల సంఘాల భవన నిర్మాణ పనులకు బాల్కొండ ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, జెడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్, ఎంపిడిఓ సంతోష్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి,వైస్ ఎంపిపి శ్రీకాంత్ యాదవ్,సర్పంచ్ చాట్లపల్లి వనజ-గోవర్దన్ గౌడ్,ఎంపీటీసీ సభ్యులు సనుగుల కవిత-శ్యామ్ సుందర్,నాయకులు అధికారులతో కలిసి మంగళవారం భూమి పూజ చేసివారు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకొని చిట్టాపుర్ గ్రామ యాదవ సంఘం నూతన భవన నిర్మాణం కోసం రూ5లక్షలు,ఒడ్డెర సంఘం భవన నిర్మాణం కోసం రూ5 లక్షలు,విశ్వ బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణం రూ4 లక్షలు మంజూరు చేయడంతో ఈరోజు భూమిపూజ చేయడం జరిగిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కేసిఆర్ సారధ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కృషితో అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు జరుగుతున్నాయని,చిట్టాపూర్ గ్రామానికి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి పనులు జరుగాయని,చిట్టాపుర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి రుణపడి ఉంటామని, చిట్టాపూర్ గ్రామ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,రైతుబందు మండల కో-ఆర్డినేటర్ నాగులపల్లీ రాజేశ్వర్, ఉపసర్పంచి న్యావనంధి రాజేందర్,గ్రామ శాఖ అధ్యక్షులు న్యావనంది సాయన్న,మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు షేక్ వాహబ్,ఎంపిటిసి సభ్యులు కన్న పోశేట్టి,అనుగుల రాంరాజ్ గౌడ్,సొసైటీ డైరెక్టర్ చిన్నోల్ల దమ్మన్న,రైతు బందు గ్రామ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ ఇఫ్తకరొద్దిన్,వార్డు సభ్యులు న్యావానంది నరేష్,నాయకులు దుధాటి సూర్య ప్రకాష్, రాజేందర్,సుదీర్ రాజేశ్వర్,పంచాయతీ రాజ్ అధికారులు,మహేందర్ రెడ్డి షరీఫ్,రవి,గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin