Saturday, 13 June 2026 11:34:08 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బలహీన వర్గాలు బిజెపికి మద్దత్తు ఇవ్వండి బిజెపి బీసీ ముఖ్యమంత్రిని చేస్తుంది...

Date : 22 November 2023 10:52 AM Views : 173

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్లీ ఒకసారి ఓటు వేస్తే ఆగం అవుతామని బిజెపికి ఓటు వేస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని షాద్ నగర్ బిజెపి ఎమ్మేల్యే అభ్యర్థి అందె బాబయ్య అన్నారు. ప్రచారాలలో భాగంగా ఈరోజు షాద్ నగర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలలో పర్యటించారు. వారితో పాటు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, చెంది పాతపల్లి కృష్ణ రెడ్డి, మహేందర్ రెడ్డి, శేరి విష్ణువర్ధన్ రెడ్డి, వంశీ కృష్ణ, మల్చలం మురళి, చెట్ల వెంకటేష్, ప్యాట అశోక్, మఠం ఋషికేష్, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అందె బాబయ్యమాట్లాడుతూ* గతం లో కాంగ్రెస్ పార్టీ కి మరియు రెండు సార్లు బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే షాద్ నగర్ ను ఏమీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సకల జనుల సమ్మే తో తెచ్చుకున్న తెలంగాణా కుటుంబ పాలయిందని విరుచుకుపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ ను నిర్మించి షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి కెసిఆర్ గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీ మరిచి షాద్ నగర్ రైతులకు మొండి చేయి చూయించారని మండి పడ్డారు. కేవలం ప్రజలు కట్టిన పన్నులు, మోడీ నిధుల వల్లనే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాలలో కుటుంబ పాలన నడుస్తుందని, బీఆర్ఎస్ ను నమ్మి మళ్ళీ ఓటేస్తే మనం ఆగమైతమని అన్నారు. తెలంగాణా లో బిజెపి అధికారం లోకి వస్తే మోడీ అట్టడుగు వర్గాలకు లబ్ధిచేకూరె విధంగా మేనిఫెస్టో విడుదల చేసారని గుర్తుచేసారు. బీసీలు బిజెపి కి సంపూర్ణ మద్దత్తు ఇవ్వాలని, బిజెపి తెలంగాణా లో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తొలి బీసీ ముఖ్యమంత్రి చేస్తుందని అన్నారు. షాద్ నగర్ లో అవినీతిని తరిమి కొడదాం, నవంబర్ 30న కమలం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ప్రజలకు సేవకునిగా పని చేస్తా, షాద్ నగర్ ను అభివృద్ధి పదం లో నడిపిస్తా అని అన్నారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా లో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, రైతులను, నిరుద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగులను, దళితులను, బలహీన వర్గాలను కెసిఆర్ ప్రభుత్వం దగా చేసిందని విమర్శలు గుప్పారు. గరీబ్ హటావో అని నినాదమిచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పరిపాలన లో పేదల బ్రతుకులు ఏమీ మార్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అబద్దపు హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే యాభై ఏళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఎంఐఎం విధానం లో నడుచుకుంటాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రైల్వే లు, జాతీయ రహదారులు, వందే భారత్ రైళ్లు, ఎంతో అభివృద్ధి చేసారని అన్నారు. నాణ్యమైన ఉచిత విద్యా, ఉచిత వైద్యం, రైతుల సంక్షేమమే బిజెపి లక్ష్యమని అన్నారు. ఈసారి షాద్ నగర్ లో బడుగు బలహీన వర్గాల ఆషాజ్యోతి అందె బాబయ్య ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండని అన్నారు. ఈ కార్యక్రమం లో షాద్ నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :