సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లో చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని చైతన్య హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవం పురస్కరించుకొని స్వపరి పాలన కార్యక్రమము మరియు ప్యాషన్ డ్రెస్సెస్ కామిటేషన్ ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్సాహముతో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎం ఎల్లారెడ్డి ప్రిన్సిపాల్ ప్రతాపరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని స్ఫూర్తితో వారి విద్యా విషయంలో సూచనలు అందిస్తూ నూతన ఓరవడిలకు నాంది పలుకుతూ విద్యార్థులకు చదువు చెప్పటంతో పాటు అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తయారు చేసి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను అని సందేశం అందించారు తదుపరి పాల్గొన్న విద్యార్థులకు విజేతలకు బహుమతులు అందజేశారు .ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు శరత్ కుమార్, శ్రీనివాసాచారి , రఫీ ,ఆనంద్ ఆసన్ మరియు ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు.
-----------------------
Admin