Saturday, 01 August 2026 12:41:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రామవరం ప్రాంతానికి గృహ లక్ష్మీ నిబంధనలు సడలించాలి...

Date : 15 August 2023 02:24 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ): గృహలక్ష్మి పథకంలోని ఇంటి స్థలానికి రిజిస్టర్ పట్టా కావాలనే నిబంధనను రామవరం ప్రాంతానికి సడలింపు ఇవ్వాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . సోమవారం జరిగిన డ్వాక్రా గ్రూపుల మహిళల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు ఎంక్వయిరీ లా పేరుతో గృహ లక్ష్మీ పథకం అర్హత సాధించాలంటే ఇంటి స్థలానికి రిజిస్టర్ పట్టా కావాలని నిబంధన విధించడం సరికాదని ఆమె విమర్శించారు. ఈ నిబంధన ద్వారా రామవరం ప్రాంత ప్రజలకి గృహలక్ష్మి పథకంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మంత్రి గంగుల కమలాకర్ మహాలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియని వాట్సాప్ లో వచ్చిన అప్లికేషన్ అది బోగస్ అని తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి, అడ్రస్ ప్రూఫ్ కి ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు మరియు తెల్ల రేషన్ కార్డు ,బ్యాంక్ అకౌంటు ఉంటే సరిపోతుందని అలాగే ఇంటి స్థలం కి గ్రూప్ లేని వారు పాత గృహానికి ఉండే కరెంట్ బిల్లు ,ఇంటి పన్ను బిల్లు పెడితే సరిపోతుందని, అలాగే గ్రామకంఠ భూములకు ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదని పత్రికా ముఖంగా వెల్లడించిన మంత్రి మాటలకు విలువ లేదని ఆమె ప్రశ్నించారు. ఇది నిరంతర ప్రక్రియని మంత్రి చెప్పిన మాటలకు అనేకమంది ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని నమ్ముకొని తారీకు దాటిన తర్వాత సంబంధిత ఆఫీసులకు దరఖాస్తు ఫారాలు అందించేందుకు పోతే పదో తారీకు రోజే చివరి డేట్ అని సమాధానం చెప్పడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారని ఆమె అన్నారు. అందుకే రామవరం ప్రాంతం 1/70 లో ఉందన్న గత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి నిబంధన లేకుండా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసినట్లుగానే రామవరం ప్రాంతానికి గృహలక్ష్మి ఇళ్లను మంజూరు చేయాలని ఆమే అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు కవిత, సునీత, బేగం, సింధు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: