సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని షాద్ నగర్ అఖిలపక్ష పార్టీలు పేర్కొన్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రతిపక్ష విపక్షాల సడక్ బంద్ కార్యక్రమం పురస్కరించుకొని కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ తదితర పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో 44వ నెంబర్ జాతీయ రహదారి వద్ద బైటాయించారు. ఉదయం నుండి పోలీసుల కళ్ళుగపి తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు వీర్లపల్లి శంకర్ తదితర శ్రేణులు అకస్మాత్తుగా 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రత్యక్షం అయ్యారు. జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన వీర్లపల్లి శంకర్ తదితరులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వారిని వాహనాలు ఎక్కించి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సై దేవకి తదితర సిబ్బందితో కలసి ఆందోళనకాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ఈ రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయని వీర్లపల్లి శంకర్ వివరించారు. కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం పార్టీలు, జాయింట్ యాక్షన్ కమిటీ, విద్యార్థి సంఘాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాయని వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రస్తుత బోర్డు చైర్మన్‌తో సహా టీఎస్పీఎస్సీ సభ్యులను తొలగించి, టీఎస్పీఎస్సీ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలని, కమిషన్‌ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పోస్టుల సంఖ్యను 13500 కు పెంచాలని, పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని శంకర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ప్రజల ఉసురుతలిగి ప్రభుత్వం నాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టారు. అఖిలపక్ష పార్టీల నాయకులు పానుగంటి పర్వతాలు, రాజు, పి రఘు, చెన్నయ్య, దొడ్డి శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, సుధీర్, ఈశ్వర్ నాయక్, శీను నాయక్, శ్రీను నాయక్, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, ముబారక్, శ్రీను నాయక్ తదితరులు మాట్లాడుతూ వెంటనే బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin