సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నారగోని స్వప్న-మురళి గౌడ్ దంపతుల కూతురు అనిక-అనిల్ గౌడ్ వివాహం హంటర్ రోడ్డు లోని పద్మావతి ఫంక్షన్ హల్ లో ఆదివారం జరిగింది. ఈ వివాహం లో పాల్గొని నూతన వదూవరులను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్,ఓబీసీ జిల్లా నాయకులు బండారి జనార్దన్ గౌడ్, కొయ్యేడి ప్రవీణ్ గౌడ్, నాగపూరి సంజయ్ గౌడ్, మడ్డి చేరాలు గౌడ్, నాగపూరి క్రాంతి గౌడ్, వరంగల్ డీసీసీ అధ్యక్షులు ఎండి.అయూబ్ పాషా, చిర్ర అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter