సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్త గూడెం : ఈ నెలాఖరు వరకు సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం ఐడిఓసి సమావేశపు హాలులో సి ఎం ఆర్ మిల్లింగ్ ప్రక్రియపై పౌరసరఫరాల అధికారులు, సంస్థ మేనేజర్, మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు మిల్లర్లకు కేటాయించిన లక్యం మేర సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. సిఎంఆర్ ప్రక్రియ పై పౌర సరఫరాల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఇంకనూ జాప్యానికి తావు లేకుండా మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. పెండింగ్ ఉన్న మిల్లర్ల నుండి త్వరితగతిన మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయుటకు ఇతర మిల్లులకు కేటాయింపు చేయాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, పౌర సరఫరాల అధికారి రుక్మిణి దేవి, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ బాబు, పౌర సరఫరాల శాఖ నాయబ్ తహసీల్దార్లు, మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు జుగల్ కిషోర్, కార్యదర్శి రాజేందర్, కోశాధికారి ఆనంద్, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin