Saturday, 01 August 2026 12:40:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేద్దాం...

Date : 31 December 2022 12:44 AM Views : 633

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేద్దామని, ఇందుకు కదలిరావాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ గా సొసైటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు, జనఔషది దుకాణాలు, ఐ బ్యాంక్, శిశు మరణాలు తగ్గించడం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, జూనియర్, సీనియర్ యూత్ రెడ్ క్రాస్ ను బలోపేతం చేయడం, వ్యవసాయంలో రైతులకు మేలు చేయడం, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, అంటువ్యాధులు, తదితర వాటిపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, తదితర ప్రజలకు మేలు, సేవ చేసేందుకు ఏ అంశాలు బాగుంటాయో అనేదానిపై చర్చించారు. ఇందుకు ఆర్థికపరమైన సహాయం అవసరం అవుతుందని, ఏ విధంగా ఆర్థిక సహాయాన్ని సమకూర్చాలన్న దానిపై చర్చించడం జరిగింది. *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేసేందుకు దాతలు ముందుకువచ్చి విరాళాలు రూపంలో ఇవ్వడం వల్ల మంచిదని, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. విరాళాలు ఇవ్వదలిచిన వారు ఇండియన్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ పేరు మీద ఏర్పాటు చేసిన పుట్టపర్తి, కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ : 110092922521 (ఐఎఫ్ఎస్ సి కోడ్ : CNRB0002351) కు విరాళాలు ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ బిల్డింగ్ కట్టుకునేందుకు ఒక ఎకరా స్థలాన్ని ఉచితంగా ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి వచ్చే శనివారంలోపు ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు యాక్షన్ ప్రణాళికతో సిద్ధంగా రావాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ మెంబర్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, రెడ్ క్రాస్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: