Thursday, 30 July 2026 02:35:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడి ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి... - సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

Date : 26 September 2023 08:31 AM Views : 812

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అంగన్వాడీ,ఆశా వర్కర్లు సమస్యలపై చిత్తశుద్ది లేని ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్దం కావాలి. కొత్తగూడెం అంగన్వాడీ,ఆశా శిబిరం లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని.రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్వాడీ,ఈ రోజు నుండి సమ్మె లో పాల్గొంటున్న ఆశా వర్కర్లు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని,మహిళా కార్మికులను రోడ్డున పడేసిన ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దింపేందుకు సిద్దం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం లో చిల్డ్రన్ పార్క్ వద్ద అంగన్వాడీ, ఆశా వర్కర్లు సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలియజేసిన తమ్మినేని మాట్లాడుతూ కనీస వేతనం, పర్మినెంట్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు అత్యంత న్యాయమైనవని, ఈ సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించేలా ప్రభుత్వానికి సిపిఎం పార్టీ తరపున లేఖ రాస్తానని అన్నారు. కార్మిక చట్టాల ప్రకారం చూసినా, అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పిన దాని ప్రకారం చూసినా ఈ రోజు ఉన్న ధరల్లో కనీస వేతనం కేవలం రూ. 26 వేలు మాత్రమే అడుగుతున్నారని, ఈ మాత్రం వేతనం ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని అన్నారు. అనేక వేల కోట్ల రూపాయలు వృధా ఖర్చులు చేసే ప్రభుత్వానికి అంగన్వాడీ, ఆశా కార్మికుల వేతనాలు పెంచడం పెద్ద సమస్యే కాదని అన్నారు. ఉద్యోగులుగా గుర్తించకుండా పని చేసినంత కాలం గౌరవ వేతనం తో వెట్టి చాకిరీ చేయించుకుంటు న్నారని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి అంగన్వాడీ, ఆశా వర్కర్లు సమ్మె సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం లో అలసత్వం ప్రదర్శించినా, తక్షణమే సమ్మె లో ఉన్న యూనియన్ లను చర్చలకు పిలవకపాయినా అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతాడు మని తమ్మినేని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సీఐటియూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకులు పద్మ, కళావతి, శైలజ, సరస్వతి, ఆశా యూనియన్ నాయకులు ఝాన్సి, రాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :