Thursday, 30 July 2026 09:45:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన... - జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

Date : 12 July 2023 07:49 AM Views : 505

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. సూర్యాపేట మండలంలోని పాత మార్కెట్ యార్డ్ లో ఉన్న ఉప్పల రామ్మూర్తి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ జనరల్ మర్చంట్ ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వానాకాలం 20 23 సీజన్ గాను సూర్యపేట జిల్లాలోని రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయుట కొరకు దుకాణ దారుల వద్ద గల యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువుల స్టాకు రిజిస్టర్ లను తనిఖీ నిర్వహించారు.ఈపాస్ మిషన్ యందు స్టాకును పరిశీలించి జిల్లాలో వానాకాలం 20 23 పంటలకు సరిపడా ఎరువుల అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారి రామారావు కు కలెక్టర్ సూచించారు ఎరువుల దుకాణాలలో పిఎసిఎస్ లలో ఎరువుల లభ్యత మార్క్ఫెడ్ గోడౌన్లలో ఎరువుల నిల్వలు జిల్లాకు కేటాయించిన ఎరువుల గురించి కలెక్టర్ వ్యవసాయ అధికారి రామారావు ను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తమ ఆధార్ కార్డును పిఓఎస్ మిషన్లో నమోదు చేసుకుని ఎరువులు కొనుగోలు చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు .డీలర్లు అందరూ పిఓఎస్ మిషన్ ద్వారానే ఎరువులను విక్రయించవలసిందిగా కలెక్టర్ తెలియ చేశారు అలాగే ఎరువుల షాపులో ఉన్న భౌతిక నిలువలను పిఓఎస్ మిషన్ నందు నిలువలకు వ్యత్యాసం లేకుండా చూడాల్సిందిగా కలెక్టర్ డీలర్లకు ఆదేశించారు ఏ షాపులోలైనా తేడా ఉన్న యెడల చట్టప్రకారం తగు చర్యలు తీసుకుని పడతాయని కలెక్టర్ తెలిపారు వానాకాలం 20- 23 సీజన్ గాను జూలై మాసం వరకు 26,922 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 31,323 సరఫరా అవ్వగా 2,796 మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేయగా ప్రస్తుతం 28,527 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉన్నాయని అలాగే ఇతర ఎరువులు డిఏపి కాంప్లెక్స్ ఎంఓపి ఎస్ఎస్పీలు జిల్లాలో అందులో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు వానాకాలం సీజన్ కు కావలసిన సరిపడా ఎరువులు విడతల వారీగా సి అండ్ డి ఏ ప్లాన్ ద్వారా జిల్లాకు సరఫరా చేయడం జరుగుతుందని జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నట్లుగా కలెక్టర్ తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: